తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Megastar: ‘లక్కీ భాస్కర్‌’పై చిరంజీవి ప్రశంసలు.. డైరెక్టర్‌ను కలిసి మరి అభినందించిన మెగాస్టార్!

వెంకీ అట్లూరి – దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలై వారం గడిచినా ఏమాత్రం క్రేజ్ దక్కడం లేదు. థియేటర్లన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటూ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే తాజాగా ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. సినిమా తనకెంతో నచ్చడంతో దర్శకుడు వెంకీ అట్లూరిని ప్రత్యేకంగా కలిశారు. మూవీ మేకింగ్‌, చిత్రబృందం పనితీరును మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. ‘మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మీ సినిమా చూసి.. వర్క్‌ని అభినందిస్తే.. మీరు ప్రత్యేకంగా ఏదో సృష్టించారని తెలుస్తోంది’ అని పేర్కొంది.

ఓవర్సీస్‌లో హవా!

1980-90ల్లో ఆర్థిక నేరాల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ ఓ మధ్య తరగతి బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించారు. ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి.. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఎలాంటి రిస్క్‌ చేశాడన్నదే ఈ కథ. భాస్కర్ పాత్రలో దుల్కర్‌ నటించగా.. అతడి సతీమణి సుమతి పాత్రను మీనాక్షి చౌదరి పోషించారు. దుల్కర్‌ యాక్టింగ్‌ను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి అంటూ విశ్వక్‌సేన్‌ ఇటీవల పోస్ట్‌ పెట్టారు. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button