Megastar: టాలెంటే కాదు, క్యారెక్టర్ కూడా ఉండాలి..! అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసిన ‘మెగా’ ఫ్యామిలీ..?
అల్లు – మెగా ఫ్యామిలీ వార్ ముగిసిపోలేదు.. ఆట ఇప్పుడే మొదలైంది.. అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. మొన్న పవన్ కళ్యాణ్.. నిన్న చిరంజీవి.. ! అన్నదమ్ములిద్దరూ కావాలనే మాట్లాడారో.. లేదా ఫ్లోలో మాట్లాడారో తెలీదు కానీ.. ఆ ఇద్దరి మాటలు అల్లు అర్జున్ అభిమానులకు గట్టిగా గుచ్చుకుంటున్నాయి. అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అన్నదమ్ముల అటాక్..?
‘టాలెంట్ ఉంటే సరిపోదు, వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎందుకంటే మనలాంటి నటీనటులు చాలా మంది ఉంటారు. మనం కాకపోతే ఇంకొకరు, వాళ్లు కాకపోతే మరొకరు. ఉన్నవారిలో మనం బెస్ట్ అనిపించుకోవాలంటే మన టాలెంట్‌తో పాటు వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యం.’ అని చిరంజీవి అన్నారు. అయితే చిరు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ని ఉద్దేశించి చేసినవేనని బన్నీ ఫ్యాన్స్ చిరుపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు, మొన్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన పవన్ ‘మనం ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు. నేను అయినా, రామ్ చరణ్ అయినా, ఏ మెగా హీరో అయినా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం చిరంజీవి గారే’ అన్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదమ్ములిద్దరూ బన్నీపై ఇండైరెక్ట్ అటాక్ చేస్తున్నారని, అల్లు-మెగా ఫ్యామిలీ వార్ ఇంకా చల్లారలేదని సోషల్ మీడియాలో చర్చ జరుతోంది. కాగా.. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ తనను తాను ఒక సెల్ఫ్‌మేడ్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.