Mohan Babu: తప్పుడు ప్రచారాలు చేయొద్దు.. ‘ఎక్స్’లో మోహన్‌బాబు ఆసక్తికర పోస్ట్!
జర్నలిస్టుపై దాడి కేసులో తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వస్తున్న వార్తల్ని సినీ నటుడు మోహన్ బాబు ఖండించారు. తాను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ‘నా ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేదు. వాస్తవాలను మాత్రమే బయటపెట్టాలని మీడియాను కోరుతున్నా’ అని తాజాగా పోస్ట్ చేశారు.
Also Read: అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ షో?
కాగా.. టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై దాడి కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఆయన ‘నా ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేదు’ అని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, ఈ కేసులో మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారు ఎం. రంజిత్ కుమార్‌కు సైతం కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం.