తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mohan Babu: హైకోర్టులో మోహన్‌బాబుకు దక్కని ఊరట

మీడియా ప్రతినిధి దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట దక్కలేదు. దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. మోహన్‌బాబు అనారోగ్యంతో ఉన్నారని, గుండె, నరాల సంబంధిత సమస్యలు, మతిమరుపుతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు, దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మోహన్‌బాబు ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

మీడియా ప్రతినిధిపై దాడి కేసు

కాగా.. మంచు మనోజ్ – మోహన్ బాబుల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 10న జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. తన ఇంట్లోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పహడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన తనను అరెస్టు చేయొద్దని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ నెల 24 వరకు ముందస్తు చర్యలొద్దని పోలీసులకు తెలిపింది. ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టు మరో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తాజాగా కొట్టేసింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button