తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Mokshagna: వారసుడి లాంఛ్‌కి బ్రేక్.. డైరెక్టర్‌ను మార్చేసిన బాలయ్య?

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీపై చాలా ఏళ్ల నుంచి చర్చ జరుగుతోంది. ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌‌గా ‘ఆదిత్య 999’ మూవీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని, దానికి స్వయంగా బాలకృష్ణే దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మోక్షజ్ఞ మొదటి సినిమాకు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఏకంగా ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ మూవీ ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరలవుతోంది.

ప్రశాంత్ వర్మ.. తప్పుకున్నాడా? తప్పించారా?

అయితే, మోక్షజ్ఞ తేజ్ డెబ్యూ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ ఎందుకు బయటికి వచ్చాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే… ప్రశాంత్ వర్మకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని డైరెక్షన్ చేయడం పట్ల ఆసక్తి లేదట. కథ మాత్రమే ఇస్తానని బాలయ్యతో చెప్పాడట. అంతేకాదు, ఆ కథకు భారీగా రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేసినట్టు సమాచారం. మోక్షు డెబ్యూ మూవీ డైరెక్షన్ చేస్తా అని, స్టోరీ చెప్పేసి, లుక్ టెస్ట్‌లు చేసిన తర్వాత మాట మార్చడంపై బాలయ్య చాలా సీరియస్ అయ్యారట. అందుకే తన వారసుడిని పరిచయం చేసే బాధ్యతను వేరే డైరెక్టర్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. దర్శకత్వ అనుభవం రీత్యా మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ప్రశాంత్ వర్మతో కంటే నాగ్ అశ్విన్‌తోనే తీస్తే అవుట్‌పుట్ బాగుంటుందని బాలకృష్ణ భావించారని, అందుకే ప్రశాంత్ వర్మను తప్పించారని వినిపిస్తోంది.

నాగ్ అశ్విన్, వెంకీ ఇద్దరిలో ఎవరు?

ఇక.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘కల్కి’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ చేతికి వెళ్లినట్టు తాజాగా సమాచారం అందుతోంది. నాగ్ అశ్విన్‌తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన కథ గురించి బాలయ్య చర్చలు కూడా జరుపుతున్నారట. అంతా ఒకే అయితే, మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ నాగ్ అశ్విన్‌తోనే ఉండబోతుందట. అలాగే ఈ ప్రాజెక్ట్‌ను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మించే ఛాన్స్ ఉంది. మరోవైపు మోక్షజ్ఞ కోసం వెంకీ అట్లూరి సైతం ఓ హై పొటెన్షియల్ స్టోరీని రెడీ చేస్తున్నారట. ఒకవేళ అన్నీ కుదిరితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ వెంకీతోనే ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో దేనిపైనా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button