తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mokshagnya: నందమూరి వారసుడు వచ్చేశాడు!

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రశాంత్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో బాలయ్య త‌న కుమారుడిని వెండితెరకు పరిచయం చేయ‌బోతున్నారు. ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెలియ‌జేస్తూ పోస్ట్ పెట్టారు. ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మూవీలోని ఆయన లుక్‌ను రివీల్ చేశారు.

బాలయ్య చిన్న కుమార్తె నిర్మాణంలో..

దర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ గ‌త రెండు రోజులుగా వ‌రుస పోస్టుల‌తో మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీ గురించి హింటూ ఇస్తూనే వ‌స్తున్నాడు. ప్ర‌శాంత్ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రానున్న సినిమాలో మోక్షజ్ఞ అలరించనున్నారు. ఈ సినిమాని ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మించనున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button