Most Popular Film Stars: ఆర్మాక్స్.. మోస్ట్ పాపులర్ స్టార్స్‌గా ప్రభాస్, సమంత!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, స్టార్ హీరోయిన్ సమంత మరో అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్.. ప్రతి నెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్‌లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్, ఫిమేల్ స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆ తర్వాత దళపతి విజయ్ రెండో స్థానంలో, అల్లు అర్జున్ మూడో స్థానంలో నిలిచారు.
హ్యాట్రిక్ కొట్టిన సమంత
ఇక, ఈ లిస్ట్‌లో హీరోయిన్ సమంత వరుసగా మూడోసారి టాప్ వన్‌లో ఉండడం విశేషం. సెప్టెంబర్, అక్టోబర్ నెలలోనూ ఆమె టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నవంబర్‌లోనూ ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో వరుసగా మూడు నెలలపాటు ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాలో టాప్ వన్‌లో ఉన్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో సమంత తర్వాత అలియాభట్, నయనతార, రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
టాప్ 10 హీరోలు!
1.ప్రభాస్
2.విజయ్
3.అల్లు అర్జున్
4.షారుక్ ఖాన్
5.ఎన్టీఆర్
6.అజిత్ కుమార్
7.మహేశ్ బాబు
8.సూర్య
9.రామ్ చరణ్
10.అక్షయ్ కుమార్
టాప్ 10లో నిలిచిన హీరోయిన్లు!
1.సమంత
2.అలియా భట్
3.నయనతార
4.సాయి పల్లవి
5.దీపికా పదుకొణె
6.త్రిష
7.కాజల్ అగర్వాల్
8.రష్మిక
9.శ్రద్ధా కపూర్
10.కత్రినా కైఫ్