తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Naga Chaithanya: బాహుబలి మేకర్స్‌తో చైతూ భారీ బడ్జెట్ మూవీ?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య మరికొద్ది రోజుల్లోనే ‘తండేల్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. చందు మొండేటి దర్శకత్వంలో సాయిపల్లవి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘బుజ్జి తల్లి’ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ఇంకా విడుదల కాకముందే నాగచైతన్య మరో భారీ బడ్జెట్ మూవీని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

కార్తీక్ వర్మ డైరెక్షన్‌లో?

బాహుబలి మేకర్స్ ‘ఆర్కా’ మీడియా బ్యానర్‌పై దాదాపు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హారర్ కామెడీ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button