తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.. నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డ్!

సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నాగార్జునకు తెలిపింది. దీంతో ఆయన తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు.

రాజకీయ దురుద్దేశంతోనే వ్యాఖ్యలు

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఈ సందర్భంగా నాగార్జున కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అన్ని టెలివిజన్‌ ఛానళ్లు, పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు. అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది. ‘2017లో నా కుమారుడు నాగచైతన్య, సమంత.. వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయి ఇద్దరూ గౌరవప్రదంగా జీవిస్తున్నారు. దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతులను కాపాడుకుంటూ వస్తున్న మా కుటుంబంపై మంత్రి సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారు. వాటివల్ల మా కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలి’ అని పిటిషన్‌లో కోరారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button