తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nandamuri: నందమూరి నాలుగోతరం వారసుడిని చూశారా?

నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం వారసుడు సినీరంగ ప్రవేశం చేసేశారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు హీరోగా డైరెక్టర్ వై.వి.ఎస్‌.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి సంబంధించి తారక రామారావు లుక్‌ను డైరెక్టర్ విడుదల చేశారు. ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ వై.వి.ఎస్. చౌదరి మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

హీరోగా ప్రమాణం!

‘ఎన్టీఆర్‌’ తన మునిమనవడు రూపంలో వచ్చారు. ఎన్టీఆర్‌ అనే పేరు మూడు అక్షరాల తారకమంత్రం. ఆరడుగుల రూపం ఈ తారక రామారావుది. ఈ హీరోకు కుటుంబం నుంచి పూర్తి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నా. నేను అందరి హీరోల అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తాను. నేను ఇప్పటివరకు పరిచయం చేసిన హీరోలందరినీ ఫ్యాన్స్‌ ఆదరించారు. అలానే ఈ తారకరామారావును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. అంతేకాదు, కొత్త హీరోపై ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ఎన్టీఆర్ ప్రమాణంతో ఈ వీడియో ఉంది. నందమూరి తారక రామారావు అనే నేను.. అంటూ తన ప్రమాణాన్ని నాలుగో తరం ఎన్టీఆర్ మొదలుపెట్టారు. వైవీఎస్ చౌదరి వద్ద 18 నెలలుగా శిక్షణ పొందినట్టు తెలిపారు. ఇందులో యాక్షన్ ప్యాక్డ్, స్టైలిష్‍గా ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. కాగా.. నందమూరి నాలుగో తరం నటుడు ఎన్టీఆర్ వస్తున్నాడంటూ కొద్ది రోజుల క్రితమే వైవీఎస్ చౌదరి ప్రత్యేక మీడియా సమావేశంలో చెప్పారు. దీంతో ఇప్పుడు అతడు ఎలా ఉంటారనే ఉత్కంఠ నెలకొంది. నేడు ఫస్ట్ లుక్ రావటంతో అతడి లుక్ రివీల్ అయింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button