తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nani: క్రేజీ కాంబో.. నానికి జోడీగా శ్రద్ధాకపూర్!

యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల – నేచురల్ స్టార్ నాని కాంబోలో వచ్చిన ‘దసరా’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే కాంబో రిపీట్ చేస్తున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే #NaniOdela2 అనే వర్కింగ్ టైటిల్‌తో, ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. దసరా సినిమా లాగా ఇది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథేనట. స్టోరీ అంతా సికింద్రాబాద్ ఏరియాలో జరగనుందని టాక్. ఇక దీంట్లో కథానాయకుడి పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో కథానాయిక పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందట. అందుకే నానికి జోడీగా ఓ పాపులర్ హీరోయిన్‌ను తీసుకురావాలని భావిస్తున్నారట.

‘సాహో’ ఇప్పటికే తెలుగులోకి ఎంట్రీ..!

ఈ నేపథ్యంలోనే ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇందులో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని తేలిపోయాయి. ఇటీవల స్త్రీ- 2 మూవీతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఒప్పించేందుకు యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందట. టాలీవుడ్‌లో శ్రద్ధాకు ఇదే కొత్త సినిమా ఏం కాదు.. ‘సాహో’తో ప్రభాస్ సరసన నటించి తనకంటూ తెలుగులో మంచి ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button