Nayanthara: నయనతార బర్త్ డే స్పెషల్.. కొత్త మూవీ టీజర్ రిలీజ్!
లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సినిమా ప్రముఖులందరూ విషెస్ చెబుతున్నారు. అలాగే నయన్ కొత్త సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీని సైతం అధికారికంగా ప్రకటించారు. ‘రక్కయి’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీ వర్క్ ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.
అంచనాలు పెంచేసిన టీజర్
ఇక, టీజర్‌ను బట్టి ఇందులో నయన్ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన కూతురు కోసం చేసే పోరాటమే ఈ మూవీ. అయితే ఈ సినిమాలో నయన్ యాక్టింగ్, పోరాటం ఎంత భయంకరంగా ఉండబోతుందనేది టీజర్‌లోనే చూపించారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి.