తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Niharika: ఆ ఘటన ఎంతో బాధించింది..! అల్లు అర్జున్‌పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు!

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ కొణిదెల నిహారిక. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన నిహారిక.. ‘ఒక మనసు’తో హీరోయిన్‌గా మారారు. ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇవేవీ ఆమెకు పెద్దగా గుర్తింపునివ్వలేదు. దీంతో పలు యూట్యూబ్‌ సిరీస్‌లనూ నిర్మించారు. అయినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే కొంతకాలం గ్యాప్ తర్వాత ఇటీవల ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ కొట్టారు. ఇక, తాజాగా త‌మిళ చిత్రం ‘మద్రాస్‌ కారన్‌’లో నిహారిక కీలక పాత్ర పోషిస్తున్నారు. షాన్‌ నిగమ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వాలిమోహన్‌ దాస్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఐశ్వర్యదత్తా కీలకపాత్ర పోషించారు. పొంగల్ కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.

అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు!

ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లు వేగంగా జరుగుతున్నాయి.ఈ మూవీ ప్రమోషన్లలో నిహారిక సైతం పాల్గొంటున్నారు. ఈ సందర్భంగానే తనను ఇన్స్ఫైర్ చేసిన తన కుటుంబ సభ్యుల గురించి నిహారిక ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కథల ఎంపికల విషయంలో తన అన్న వరుణ్‌తేజ్‌ సలహాలు తీసుకుంటానని, ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలనే విషయాన్ని రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటానని చెప్పారు.
స్టైల్స్, లుక్స్‌ విషయంలో అల్లు అర్జున్‌ నుంచి స్ఫూర్తి పొందుతానని అన్నారు. అంతేకాదు, ఇటీవల సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఆమె స్పందించారు. ఆ ఘటన తనను ఎంతో బాధించిందని అన్నారు. ఇలాంటి ఘటనలను ఎవరూ ఊహించరని తెలిపారు. ఆ విషయం తెలిసి తన మనసు ముక్కలైందని చెప్పారు. అందరి ప్రేమాభిమానాలు, మద్దతుతో అల్లు అర్జున్‌ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button