Odela Railway Station-2: ఓదెల రైల్వేస్టేషన్-2 నుంచి కీలక అప్డేట్.. ప్రకటించిన మూవీ టీమ్
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఓదెల 2. తమన్నా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఓదెల-2. 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఓదెల రైల్వే స్టేషన్‌కి కొనసాగింపుగా రానుంది ఈ ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్, బిహైండ్ సీన్స్ వీడియో అటు తమన్నా అభిమానుల్లో ఇటు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
Read also: Tollywood: వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్న మీనాక్షి… టాప్ హీరోయిన్ అయ్యేనా?
ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్‌లో క్లైమాక్స్ షూటింగ్‌తో జరుగుతోంది. ఈ చిత్రంలో వచ్చే అత్యంత కీలకమైన ఆలయ సన్నివేశాలను తెరకెక్కించేందుకు అధిక బడ్జెట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు తమన్నా, ఇతర నటీనటులు ప్రసుతం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
కాగా హైదరాబాద్ బోనాలు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టుకుని, తమన్నా భాటియా తలపై బోనం తీసుకువెళుతున్న పోస్టర్ చూడచక్కగా ఉంది. యాదృచ్ఛికంగా బోనాల సంబరాలు జరుగుతున్నప్పుడు బోనాల ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు ఓదెల యూనిట్. బలమైన కథా, కథనంతో భారీ యాక్షన్‌ను మిళితం చేయడంలో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది. అతని పర్యవేక్షణలో నిర్మిచబడుతున్న ఓదెల-2 సినీ ప్రేక్షకులను అలరిస్తుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా సిటిమార్, రచ్చ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.