OTT: ఓటీటీలోకి రానున్న ‘సరిపోదా శనివారం’.. విడుదల ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని నాని హిట్ సినిమాల లిస్ట్‌లో చేరింది. అయితే.. ఏపీ, తెలంగాణలో వరదలు ఈ సినిమా కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక, ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం కానుంది.
ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక, ప్రమోషన్ల నుంచే ‘సరిపోదా శనివారం’ సినిమాకు హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా హక్కుల కోసం డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ వీటిని సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని కూడా నిర్మాతలకు ముట్టజెప్పింది.