OTTs: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు!
మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ ‘దేవర’.. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయాన్’ ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘దేవర’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో, ‘వేట్టయాన్’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన ‘దేవర’
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం ‘దేవర-పార్ట్ 1’. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సముద్రం బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన దేవర.. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో రికార్డులు నెలకొల్పిన దేవర.. ఓటీటీలో కూడా కొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం. ఇక, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. రెండు హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చాయని తెలిసి.. మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు.