తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pan India Mania: ‘పుష్ప-2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రమోషన్స్‌కు పట్నా, లక్నోలే ఎందుకు?

ఒకప్పుడు బయటి దేశాల వాళ్లకు ఇండియన్ సినిమా అంటే ఒక్క బాలీవుడ్ అని మాత్రమే తెలుసు. కానీ ‘బాహుబలి’ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. డైరెక్టర్ రాజమౌళి మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లారు. దీంతో కోలీవుడ్, మాలీవుడ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియాలో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్‌ఆర్‌’, ‘కల్కి’, ‘కేజీయఫ్‌’, ‘విక్రమ్‌’ వంటి చిత్రాలకు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా ‘పుష్ప2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలకు నార్త్‌లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

నార్త్ సత్తా చాటిన పుష్ప!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2: ది రూల్‌’. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైన ప్రచారం లేకపోయినా ‘పుష్ప’ పార్ట్ 1కి నార్త్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక, ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ‘పుష్ప2’ను అందుకు తగినట్లే ప్రచారం చేయాలని చిత్ర బృందం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పట్నాలో ట్రైలర్‌ విడుదల వేడుకను నిర్వహిస్తున్నారు. అంతేకాదు, కోల్‌కతా, ముంబయితో పాటు, కోచి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఈవెంట్స్‌ ప్లాన్‌ చేశారు. బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ – శంకర్‌ల క్రేజ్!

ఇక, రామ్ చరణ్ హీరో నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ది కూడా సేమ్ యాక్షన్ ప్లాన్. శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడంతో పాన్ ఇండియాలో లెవల్‌లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక, ‘RRR’తో చరణ్‌కు కూడా అక్కడ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అంతకుముందే ఆయన నటించిన పలు చిత్రాలు హిందీలో డబ్‌ అయి, యూట్యూబ్‌ వేదికగా అలరించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల కానుండగా, టీజర్‌ను తాజాగా లక్నో వేదికగా విడుదల చేశారు. రామ్‌చరణ్‌, ఎస్‌జే సూర్య, కియారా అడ్వాణీ సహా నిర్మాత దిల్‌రాజు స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రైలర్‌ విడుదల వేడుకతో పాటు, బాలీవుడ్‌ మీడియాతో చిట్‌చాట్‌లు నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉండటంతో మరిన్ని ప్రచార కార్యక్రమాలను నార్త్‌ ఇండియాలో నిర్వహించేందుకు రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button