Pawan: మరో వారసుడు వచ్చేస్తున్నాడు.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పవన్ తనయుడు!
టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ నడుస్తున్న వేళ ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో అకీరా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఓజీ’లో పవన్ పాత్ర మూడు దశల్లో ఉంటుందట. టీనేజ్ కుర్రాడిగా, యువకుడిగా, గ్యాంగ్ స్టర్‌గా ఇలా మూడు దశల్లో చూపిస్తారట. అయితే 15 నిమిషాల పాటు ఉండే టీనేజ్ కుర్రాడి పాత్రలో అకీరా నటిస్తే బాగుంటుందని సుజీత్ సూచించాడట. దీంతో పవన్, ‘ఓజీ’ కోసం అకీరాను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఓజీ’పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక పవన్ తనయుడు అకీరా కూడా ఈ సినిమాలో నటిస్తే ఇక ఆ అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు.
డిసెంబర్ 31న ఫస్ట్ సింగిల్?
కోల్‌కతా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘ఓజీ’ మూవీని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. మరోవైపు, ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమా ఫస్ట్ సింగిల్.. డిసెంబర్ 31న రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే థమన్ ట్యూన్‌ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సలార్ బ్యూటీ శ్రియా రెడ్డితో పాటు.. అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.