తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Pawan Kalyan: అల్లు-మెగా ఫ్యాన్ వార్.. పవన్ మళ్లీ ఆజ్యం పోశారా?

అల్లు-మెగా ఫ్యామిలీల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి కొనసాగుతున్న ‘గ్యాప్’ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఫిల్ అయిపోయింది. రెండు ఫ్యామిలీల మధ్య నడిచిన కోల్డ్ వార్‌కి ఈ సంఘటన బ్రేక్ వేసింది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు బన్నీ ఇంటికి వెళ్లి అల్లు అరవింద్‌‌‌ని ఓదార్చడం, జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ సైతం కుటుంబ సమేతంగా చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లి కలిసి రావడంతో ఇక, ఈ వార్ ముగిసిపోయినట్లే అన్న ఫీలింగ్ కలిగింది. ఇరు వర్గాల ఫ్యాన్స్ సైతం ‘మనమంతా ఒక్కటే’ అన్నట్టుగా కలిసిపోయినట్లు కనిపించింది.

పవన్‌పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్!

కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సీన్ మళ్లీ రివర్స్ అయ్యింది. అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎపిసో‌డ్‌లో పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారో? అని దాదాపు 25 రోజులుగా ఇటు సినీ వర్గాలు, అటు రాజకీయ వర్గాలు ఎదురుచూశాయి. తీరా ఆయన ఓపెన్‌ అయ్యే సరికి.. పవన్ తన అభిప్రాయం చెప్పకపోయి ఉంటేనే బాగుండు అనుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పవన్ స్పందన చూస్తే మొత్తంగా కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే చందాన మాట్లాడారు. ఆయన రాజకీయ ప్రసంగాల లాగే గజిబిజిగా, గందరగోళంగానే అల్లు అర్జున్ వ్యవహారంలో పవన్ స్పందన కనిపించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒకింత ఆయన రేవంత్ రెడ్డి వైపే మాట్లాడారు.

అల్లు అర్జున్‌లో మానవీయ కోణం లోపించిందా?

అల్లు అర్జున్ తరుఫున మానవీయ కోణం లోపించిందని, ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబాన్ని ఆయన కానీ, ఆయన తరుఫున వేరే ఎవరైనా కానీ పరామర్శిస్తే ఇంత దాకా వచ్చేది కాదని పవన్ అన్నారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారని కూడా వ్యాఖ్యానించారు. పైగా ఈ విషయంలో ఇటు రేవంత్ రెడ్డిది గానీ, ఇటు పోలీసులది గానీ తప్పేం లేదని చెప్పారు. సీఎం పేరు మర్చిపోయారని అరెస్ట్ చేశారని అనడం కూడా కరెక్ట్ కాదని అన్నారు. ఇక, ఈ వ్యవహారంలో బన్నీని ఒంటరిని చేశారని మాత్రం చెప్పారు. అయితే పవన్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆయన మాటలు సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ పోలీసులకే సపోర్టుకు ఉన్నాయని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మాత్రం దానికి.. పైగా ఇన్ని రోజుల తర్వాత స్పందించడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్‌లో మానవీయ కోణం లోపిస్తే చిరంజీవి, నాగబాబు ఎందుకు వచ్చి బన్నీ కుటుంబాన్ని కలిశారని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి అల్లు-మెగా ఫ్యాన్స్ వార్ మళ్లీ షురూ అయ్యింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button