తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. ‘హరిహర వీరమల్లు’లో పాట పాడిన పవర్ స్టార్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు ఆయన అభిమానులు మాత్రం తమ హీరో నుంచి మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ కానుకగా అదిరిపోయే న్యూస్ తెలిపింది.

జనవరి 6న ఫస్ట్ సాంగ్ రిలీజ్!

క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణల దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ మూవీ నుంచి కీలక అప్డేట్ అందింది. ఈ చిత్రంలోని మొద‌టి పాట విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ‘మాట వినాలి’ అంటూ ఈ పాట సాగ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ పాట‌ను స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడినట్లు తెలిపారు. ఈ పాట‌ను జ‌న‌వ‌రి 6న ఉద‌యం 9 గంట‌ల 6 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. కాగా ఆస్కార్ విన్న‌ర్ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య‌మూవీస్ బ్యాన‌ర్‌పై ఏఎం ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. మొదటి పార్ట్ మార్చి 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button