తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pawan Kalyan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అబ్బాయ్ కోసం రంగంలోకి బాబాయ్!

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన ఎన్నికలకు ముందే కమిట్ అయిన సినిమాల షూటింగులకు సైతం చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. పవన్ రాజకీయ కార్యక్రమాల షెడ్యూల్‌ను బట్టే నిర్మాతలు సినిమా షూటింగ్స్ షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఇక, పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక్క సినిమా ఫంక్షన్‌కి గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గానీ వెళ్లలేదు. కానీ మొదటి సారి అబ్బాయి కోసం బాబాయ్ రంగంలోకి దిగుతున్నారు.

ముఖ్య అతిథిగా పవన్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు మూవీ టీం అఫీషియల్‌గా ప్రకటించింది. జనవరి 4న రాజమండ్రిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ వస్తున్నారని తెలిసి మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటారు. బాబాయి, అబ్బాయిలను ఒకే వేదికపై చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామంటున్నారు మెగా ఫ్యాన్స్. కాగా.. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10న సంక్రాంతి కానుగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అడ్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటించగా, శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button