
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ తప్పేలా లేదు. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. కానీ ఆ రోజు కూడా సినిమా వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఎందుకంటే నితిన్ ‘రాబిన్ హుడ్’, నార్నె నితిన్ ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలు మార్చి 28, 29న విడుదల కానున్నట్లు ప్రకటించాయి.
అందుకే లాక్ చేసుకున్నారా?
ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ సినిమా వాయిదా పడినట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ లాంటి ఓ పెద్ద హీరో సినిమా వస్తున్నప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అదే రోజు రావడానికి సాహసం చేయవు. కానీ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ నాడే ఈ రెండు సినిమాలు వస్తుండటం, పైగా ఇంత సడెన్‌గా ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం చూస్తుంటే.. ‘హరిహర వీరమల్లు’ పోస్ట్ పోన్ అవ్వడంతోనే ఆ డేట్‌ను ఈ రెండు సినిమాలు లాక్ చేసుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్రేక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ‘హరిహర వీరమల్లు’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా సాగుతోంది. ఇప్పటికే పలు కారణాలతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడ్డ విషయం కూడా తెలిసిందే.