Prabhas: క్రేజీ కాంబో.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ప్రభాస్.. ఏకంగా నెగెటివ్ షేడ్స్‌లో!
‘హనుమాన్’ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ పాపులర్ అయిన ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించి అందులో వరుస సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి జై హనుమాన్, మహాకాళీ, అధీరా, మోక్షజ్ఞ సినిమా.. ఇలా లైన్‌గా సినిమాలు అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దాని పేరే ‘బ్రహ్మరాక్షస’. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో ప్రభాస్ నటించనున్నట్లు వినిపిస్తోంది.
మరో నాలుగేళ్లు ఆగాల్సిందే!
ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చెప్పిన కథను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓకే చేశారట. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రానున్న ‘బ్రహ్మరాక్షస’ అనే మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ మూవీ పట్టాలెక్కాలంటే మరో మూడు, నాలుగేళ్లు ఆగాల్సిందేనట. ప్రభాస్ ఇప్పటికే ఐదు చిత్రాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీకి కూడా ఓకే చెప్పారు. అలాగే కల్కి- 2, సలార్ – 2 మూవీస్ సైతం ప్రభాస్ లైనప్‌లో ఉన్నాయి. ఈ ఐదు చిత్రాల తర్వాతే ప్రశాంత్ వర్మ – ప్రభాస్ మూవీ ఉంటుందని వినిపిస్తోంది.