తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prabhas: తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన హీరో ప్రభాస్!

సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ ఒక సెన్సేషన్.. ఆ పేరు వింటే చాలు మాస్ ఆడియన్స్‌కి పూనకాలొస్తాయ్.. క్లాస్ ఆడియన్స్‌లో ఓ రకమైన వైబ్రేషన్స్ కనిపిస్తాయ్.. అప్పటి ‘ఈశ్వర్’ నుంచి మొన్నటి ‘కల్కి’ దాకా ఇండస్ట్రీలో ప్రభాస్ జర్నీ ఎంతో ప్రత్యేకం. ఆయన ఏ పాత్ర చేసిన ఆ పాత్ర తనకోసమే పుట్టిందా అన్నట్టుంటుంది. అంతేకాదు, ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న ఏకైక హీరో ప్రభాస్ అని చెప్పాలి. బాహుబలి, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇవన్నీ దేనికవే ప్రత్యేకం. ఈ మూవీస్ అన్నీ హిట్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రభాస్ కెరీర్‌ను ఓ స్థాయిలో నిలబెట్టాయి. ఇప్పుడు ఈ రెబల్ స్టార్ మూవీస్ బిజినెస్ రూ. 300 కోట్ల నుంచి రూ.500 కోట్లకు చేరుకుందంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!

దాతృత్వంలో రారాజు!

ఇక, ప్రభాస్ 1979 అక్టోబర్ 23న మద్రాసులో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు వారి కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రభాస్. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అందరూ ప్రేక్షకులు అభిమానాన్ని ఆయనం సొంతం చేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. అన్నిటికీ మించి విపత్తుల వేళ ప్రజలకు ఆర్థికసాయం చేయడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల ఏపీ, తెలంగాణలో సంభవించిన వరదల వేళ అందరి కంటే ముందు ప్రభాస్ స్పందించి తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. కోటి చొప్పున విరాళం ప్రకటించారు. అందుకే ఆయనను రియల్ హీరో అని అందరూ కొనియాడతారు.

ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే!

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన హీరో ప్రభాస్.. తెలుగు సినిమాకు పాన్ ఇండియాను పరిచయం చేసింది కూడా ఆయనే. ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్‌ గుర్తింపు పొందారు. ఇక, రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో నటించాలనేది ఆయన డ్రీమ్‌. నటుడు కాకపోయుంటే హోటల్‌ రంగంలో స్థిరపడేవారట. చిన్న సినిమాలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలోనూ అంతే. ఆయా చిత్రాల గురించి మాట్లాడటమో.. సోషల్‌ మీడియా వేదికగా ప్రచార చిత్రాలు విడుదల చేయడమో చేస్తుంటారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button