తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prabhas: ఒకే బ్యానర్‌లో మూడు సినిమాలు చేయనున్న ప్రభాస్.. హొంబలే ఫిల్మ్స్ కీలక ప్రకటన!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ చూసి ఆయనతో సినిమాలు చేయాలని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ కీలక ప్రకటన చేసింది. రానున్న నాలుగేళ్లలో ప్రభాస్‌తో సలార్ – 2తో కలిపి మొత్తం మూడు సినిమాలు చేయనున్నట్లు, ఈ మేరకు ప్రభాస్ సైన్ కూడా చేసినట్లు ప్రకటించింది. ఈ సినిమాలు 2026, 2027, 2028ల్లో ఉండనున్నట్లు స్పష్టంచేసింది.

ఫుల్ జోష్‌లో ప్రభాస్ అభినమానులు!

‘భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా మూడు చిత్రాల భాగస్వామ్యంలో ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాటిక్‌ అనుభూతిని సృష్టించాలనే మా నిబద్ధతకు సంబంధించిన ప్రకటన ఇది. వేదిక సిద్ధమైంది. ముందుకుసాగే మార్గం అపరిమితంగా ఉంటుంది. #Salaar2 తో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి’ అని తెలిపింది. ‘ది హోంబలే ఈజ్‌ కాలింగ్‌ ప్రభాస్‌’ అని పేర్కొంది. ‘సలార్‌ 2’ మినహాయించి మిగిలిన ప్రాజెక్టులు ఏమిటనే విషయాన్ని నిర్మాణ సంస్థ తెలియజేయలేదు. మరోవైపు, ఈ విషయంపై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button