Pre Release Event: హైదరాబాద్‌లో ‘పుష్ప -2’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్!
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘పుష్ప-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 2న హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ ప్లాన్ చేసినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా చిత్ర బృందం పోస్ట్ పెట్టింది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు, సినీ అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 5న రిలీజ్
ఇక.. సుకుమార్ రూపొందించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా ఈ సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీమ్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఆరు భాషల్లో దాదాపు 12 వేలకిపైగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశాన్ని మేకర్స్ కల్పించారు. 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఈ సినిమా సిద్ధమైంది.