
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత పెద్ద మూవీ అయినా, ఎంత గొప్ప హీరో ఉన్నా.. సినిమాల థియేట్రికల్ రన్ చాలా తక్కువ. బ్లాక్ బస్టర్ హిట్ అయినా మాగ్జిమమ్ 25 రోజుల కంటే ఎక్కువగా థియేటర్లలో సినిమాలు ఆడటం లేదు. అయితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప-2’ మాత్రం అద్భుతాలు సృష్టిస్తోంది. రప్పా రప్పా 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఏకంగా కొన్ని చోట్ల ఈ మూవీకి హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారంటే మామూలు విషయం కాదు.
వసూళ్ల బీభత్సం!
ఇక, వసూళ్ల పరంగా ‘పుష్ప-2’ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోనే అరుదైన బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఫస్ట్ రోజే.. రూ.294 కోట్లు వసూళ్లను రాబట్టింది.ఇక, తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 31న ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెరిగిన రన్ టైంతో కలుపుకొని మొత్తం మొత్తం 3 గంటల 40 నిమిషాల రన్ టైంతో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.