Pushpa-2 Dialogue War: పుష్ప-2లో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ డైలాగ్స్.. నిజమేనా?
దేశమంతా ‘పుష్ప 2’ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ జాతర కొనసాగుతోంది. మూవీలో అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించారని అందరూ మెచ్చుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫైట్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అని, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మూవీలోని కొన్ని డైలాగ్సే కారణమట.
Also Read: మూవీ రివ్యూ: ‘పుష్ప-2: ది రూల్’
ఎవరిని ఉద్దేశించి?
మూవీలో అల్లు అర్జున్ ఓ సందర్భంలో ‘ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్..?’ అని డైలాగ్ చెబుతారని ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి బాస్ అనే మెన్షన్ మాత్రమే ఉన్నట్టుగా సినిమా చూసినవారి మాట. ఇండస్ట్రీలో బాస్ అని మెగాస్టార్ చిరంజీవిని పిలుస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బాస్ కొడుకు ఎవరు, బాస్ తమ్ముడు ఎవరో కూడా టాలీవుడ్ జనాలకు తెలుసు. కాబట్టి ఈ డైలాగ్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టినదే అని మెగా ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. అలాగే ‘పావలా పర్సెంట్’ ‘పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెధవకి..’ వంటి డైలాగ్స్‌పైన ట్రెండ్ చేస్తున్నారు. కానీ మూవీలో వాస్తవానికి పావలా పార్టనర్ అనే యాంగిల్‌లో అన్నట్టుగా ఆ డైలాగ్ ఉందట. అయితే దీనిని పవన్ కళ్యాణ్‌కు ఆపాదించి కొందరు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ డైలాగులతో బన్నీ మీద మెగా ఫ్యాన్స్ పగ బట్టేశారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎదిగి, వారిపైన ఎందుకు ఇంత పగ పెట్టుకున్నావ్ బన్నీ? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఈ సినిమాపైన నెగిటివిటీని మరింత పెంచేందుకు మూవీలో లేని డైలాగులను ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.