తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Pushpa – 2: దేవీ శ్రీ ప్రసాద్‌ని హర్ట్ చేసింది ప్రొడ్యూసర్స్ మాత్రమేనా?

సౌత్ ఇండియాలోనే మంచి క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.. ఆయన మ్యూజిక్ ఇచ్చాడంటే చాలు.. సినిమా ఎలా ఉన్నా మ్యూజికల్‌గా మాత్రం ఆ సినిమా సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం. అందుకే ఆయనతో పనిచేసేందుకు ఎంతోమంది దర్శక, నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. దేవీ శ్రీ ప్రసాద్‌కి కూడా అంతే. ఎవరు పెట్టిన పొగో తెలీదు గానీ.. పాన్ ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప – 2’లో ఆయనకు పొగ పెట్టారు. ఏకంగా నిర్మాతలకు, డీఎస్పీకి చిచ్చు పెట్టారు. అది ఎంత దాకా వెళ్లిందంటే ఏకంగా స్టేజీపైనే డీఎస్పీ.. తన బాధనంతా వెళ్లగక్కే దాకా వెళ్లింది.

Also Read:  ‘కల్కి – 2’పై షూటింగ్ అప్డేట్.. నిర్మాతలు కీలక వ్యాఖ్యలు!

ఇంతకీ ఎవరి పని?

పుష్ప-2 చెన్నై ఫంక్షన్‌లో డీఎస్పీ తన మనసులోని మాటలు బయట పెట్టేశారు. నిర్మాతలకు తన మీద చాలా కంప్లయింట్‌లు ఉన్నాయని, టైమ్‌కు ట్యూన్ ఇవ్వలేదు. టైమ్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. టైమ్‌కు ఫంక్షన్‌కు రాలేదు అంటారంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డీఎస్పీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ డీఎస్పీ ఆవేదనకు కారణం ఎవరు? కేవలం ప్రొడ్యూసర్స్ మాత్రమేనా? పుష్ప-2 సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీని కాదని మరికొందరు మ్యూజిక్ డైరక్టర్లను ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. దీంతో దేవిశ్రీ హర్ట్ అయినట్టు చాలా వార్తలొచ్చాయి. ఇది ఎవరి పని అని ఆరా తీసే క్రమంలో సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఒక దశలో అల్లు అర్జున్‌తో బాగా క్లోజ్‌గా ఉండే ఓ స్టార్ డైరక్టర్ ఈ పని చేయించాడనే ప్రచారం కూడా నడిచింది. మొత్తానికి అంతా కలిసి ఈ నెపాన్ని నిర్మాతలపై నెట్టి చేతులు దులుపుకున్నట్లుగా ఈ తాజా పరిణామంతో తెలుస్తోంది. మరి మున్ముందు ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

వారిని అనే ధైర్యం లేదా?

అసలైతే ‘పుష్ప – 2’లో బీజీఎం కోసం సంగీత దర్శకుడిని మార్చాలన్న నిర్ణయం నిర్మాతలది కాదట. అది అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకున్న నిర్ణయమట. ఈ నిర్ణయంలో నిర్మాతల హస్తం చాలా చిన్నది. సినిమాకి కొత్త సంగీత దర్శకుడిని అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకువచ్చారు. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ ఏమైనా అనాలి అనుకుంటే వాళ్లని అనాలి తప్ప నిర్మాతలని కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ వంటి స్టార్లని అనగలిగే ధైర్యం లేక మాత్రమే.. దేవిశ్రీప్రసాద్ ఇలా సినిమా నిర్మాతల మీద పడి ఏడుస్తున్నారు అంటూ మరికొంత నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button