
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప-2’ రిలీజై 45 రోజులు దాటినా వసూళ్ల పరంగా ఏమాత్రం ‘తగ్గేదేలే’ అంటూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 1860 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ.. త్వరలోనే రూ. 1900 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టనుంది. మూవీకి వస్తున్న క్రేజ్‌ను బట్టి మేకర్స్ రీలోడెడ్ వెర్షన్‌ను కూడా తీసుకొచ్చారు.అదనంగా మరో 20 నిమిషాల ఫుటేజీని జోడించారు. జనవరి 17 నుంచి ఈ వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
త్వరలోనే రూ. 2 వేల కోట్లు..!
వసూళ్లు పెంచే ఉద్దేశంతో మేకర్స్ ప్లాన్ చేసిన రీలోడెడ్ వెర్షన్ కూడా వర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలోనే రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి మూడు పెద్ద హీరోల సినిమాలు రిలీజైనా పుష్ప- 2కు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. రీ లోడెడ్ వెర్షన్‌కు సైతం సిటీస్‌లోని కొన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇదే క్రేజ్ కొనసాగితే అమీర్ ఖాన్ మూవీ దంగల్ రికార్డు (రూ. 2 వేల కోట్లు)ను సైతం అధిగమించి భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది.