తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pushpa – 2: ప్చ్.. హైదరాబాద్‌లో పుష్ప-2 ఈవెంట్ లేనట్టేనా?

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ‘పుష్ప – 2’. డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూవీ టీమ్ అంతా ప్రమోషన్లలో మునిగి తేలుతోంది. పాట్న, చెన్నై, కొచ్చి.. ఇలా వరుసగా ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాతలు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అయితే వారి ఆశలు ప్రస్తుతానికి గల్లంతైనట్లు తెలుస్తోంది.

నో పర్మిషన్..!

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడాలోని పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంతా రెడీ అని కూడా టాక్ నడిచింది. కానీ అవన్ని పుకార్లుగానే మిగిలాయి. నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతులు కోరిన మాట వాస్తవమే. కానీ అనుమతులు రాలేదు. వాస్తవానికి ముందు ఈ ఈవెంట్‌ను LB స్టేడియంలో అనుకున్నారు కానీ సెట్ కాలేదు. అది కాదని, గచ్చిబౌలి స్టేడియం కావాలని అడిగారు కానీ అందుకు పోలీస్ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. చివరిగా యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో ఓకే అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఓ చిన్న ఇబ్బంది ఎదురైంది. యూసఫ్‌గూడా గ్రౌండ్‌లో ఇటీవల ఓ కన్వెన్షన్ నిర్మించారు. పుష్ప-2 ఈవెంట్ అంటే భారీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా సెట్ అవదని భావించి అనుమతులు ఇవ్వలేదు. ఇక చేసేదేమి లేక తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసి ఇక్కడ సక్సెస్ మీట్ పెట్టుకుందాంలే అనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button