
Pushpa-2 OTT Release: అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?
ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. జనవరి 30వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీలో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో ఓటీటీలో పుష్ప-2 సందడి చేయనుంది. రీలోడెడ్ వెర్షన్‌ను చూసేందుకు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు, సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆల్ టైం రికార్డు వసూళ్లు!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.1896 కోట్లు వసూలు చేసి అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ (రూ. 2000 కోట్లు) తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. రూ. 1896 కోట్ల వసూళ్లు సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా నిలిచింది. 50 రోజుల తర్వాత కూడా ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.