Pushpa-2: పవర్ ప్యాక్డ్ యాక్షన్స్.. ‘పుష్ప – 2’ ట్రైలర్ అదుర్స్!
యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎదురుచూపులకు బ్రేక్ పడింది. సుకుమార్ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘పుష్ప – 2’ ట్రైలర్ పాట్నా వేదికగా విడుదలైంది. మొదటి నుంచి ఊహించనట్టే ఈ ట్రైలర్‌ను దుమ్మురేపింది. అబ్బబ్బా.. అల్లు అర్జున్ అరాచకం సామీ.. అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు. ట్రైలర్‌ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్‌తో నింపేశారు దర్శకుడు సుకుమార్. బన్నీ చెప్పే డైలాగ్స్, యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఫహద్ లుక్ అండ్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.
డిసెంబర్ 5న రిలీజ్!
‘పుష్ప-1’కు కొనసాగింపుగా పుష్ప – 2 రానుంది. తొలి భాగంలో అల్లు అర్జున్ కూలీ నుంచి సిండికేట్ పాట్నర్‌గా ఎదిగిన విధానాన్ని చూపించారు. ఇక ఇప్పుడు పుష్ప-2లో సిండికేట్‌కు కింగ్‌గా మారిన పుష్ప రాజ్‌ను చూపించనున్నారు. పుష్ప-2 లో అల్లు అర్జున్‌తో పాటు పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనంజయ, జగదీష్, ప్రతాప్ భండారి తదితరులు నటించారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలని ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై హైప్‌ను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.