తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pushpa-2: బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న పుష్ప-2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్‌’. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు.. ఏకంగా వరల్డ్ ఫైర్ అంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ సినిమా మొదటిరోజు వసూళ్లలోనూ సత్తా చాటినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 4 రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన ‘పుష్ప 2’ కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లోనూ టాప్‌లో కొనసాగుతోంది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా రూ. 95.1 కోట్లు, హిందీ రూ. 67 కోట్లు, తమిళ్ రూ. 7 కోట్లు, కన్నడ రూ. కోటి, మలయాళం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

రికార్డులు బద్దలు!

అంతేకాదు, అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూలు చేసినట్లు నిర్మాణసంస్థ తెలిపింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం ‘పుష్ప 2’ అని పేర్కొంది. దీంతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (రూ. 133 కోట్లు) రికార్డును బద్దులు కొట్టినట్లు తెలుస్తోంది. అలాగే హిందీలోనూ ఈ మూవీ ఆల్ టైం రికార్డులు నమోదు చేసింది. బాలీవుడ్‌లో ఇప్పటివరకు షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా (రూ. 65 కోట్లు) పేరిట ఉన్న తొలి రోజు రికార్డులను పుష్ప-2 (రూ. 67 కోట్లతో) అధిగమించింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button