తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pushpa-2: రిలీజ్‌కు ముందే పుష్ప-2 రికార్డుల జాతర.. అస్సలు తగ్గేదే లే..!

అల్లు అర్జున్ – రష్మిక మందన్న నటించిన పుష్ప-2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే ఈ మూవీ విడుదలకు ముందే ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం!

రికార్డులు

  • ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు (ఇండియాలో 6,500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌). దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించింది.
  • ‘పుష్ప-2’ ట్రైలర్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే 150 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఇది విడుదలైన 15 గంటలలోపు 40 మిలియన్ల వీక్షణలు పొందిన ఫస్ట్‌ సౌతిండియా మూవీ ట్రైలర్‌గా నిలిచింది.
  • విదేశాల్లో ‘పుష్ప-2’ ప్రీ సేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా యాభై వేల టికెట్స్ సేల్‌ అయిన చిత్రంగా ఈ మూవీ రికార్డు నెలకొల్పింది.
  • అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది.
  • ‘పుష్ప-2’ హిందీ వెర్షన్‌ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా 24 గంటల్లో లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. బాలీవుడ్‌లో ఆల్‌ టైమ్‌ టాప్ చిత్రాల లిస్ట్‌లో ఈ చిత్రం మూడో స్థానంలో నిలిచింది.
  • బుక్‌ మై షోలో వన్‌ మిలియన్‌, పేటీయంలో 1.3 మిలియన్ల మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ స్థాయిలో ఇంట్రెస్ట్‌లు నమోదైన చిత్రం కూడా ‘పుష్ప-2’నే కావడం విశేషం.
  • ‘పుష్ప-2’ పాట్నా ఈవెంట్ హైయెస్ట్‌ లైవ్‌ వ్యూవర్స్‌ నమోదైన తొలి ఈవెంట్‌గా నిలిచింది.
  • ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలిరోజు రూ.303 కోట్లు వసూళ్లు చేయొచ్చని అంచనా. ఇదే జరిగితే రూ.300 కోట్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ నిలుస్తుంది

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button