Pushpa 2: సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ‘పుష్ప – 2’ కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్?
పాన్ ఇండియా లెవల్లో ఏ సినిమాకు లేని క్రేజ్ పుష్ప – 2 సినిమాకు ఉంది. ఇటీవల బిహార్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడం, ట్రైలర్ కూడా పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్‌తో కేక పుట్టించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్‌ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 5న రిలీజ్!
పుష్ప-2కు ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన రెండు పాటల్ని ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా. అవి యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌ని రాబట్టాయి. ట్రైలర్‌లోనూ డీఎస్పీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోరే వినిపించింది. అయితే సినిమాలో మాత్రం దేవీతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ఆర్ కూడా వినబోతున్నారని న్యూస్. ఇప్పటికే థమన్ పుష్ప – 2 సినిమాలో ఫస్టాప్‌కు పని చేశానని క్లారిటీ ఇచ్చారు. రీసెంట్‌గా ఓ ఈవెంట్లో ఇదే విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇక, ఇదే సినిమాలోని కొన్ని సీక్వెన్స్‌కు స్యామ్ సీఎస్‌తో పాటు అజినీష్ లోక్‌నాథ్ కూడా ఆర్ఆర్ ఇచ్చాడంటున్నారు. ఇలా పుష్ప-2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.