తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pushpa-3: ‘పుష్ప-3’పై క్రేజీ అప్డేట్.. టైటిల్ కూడా ఫిక్స్!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప-2’కి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో మూవీ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప-3కి సంబంధించి క్రేజీ అప్డేట్ అందింది. పుష్ప-3 ఉంటుందా? లేదా? అని గత కొద్ది రోజులు వస్తున్న వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ ఫోటోను బట్టి పుష్ప-3 కచ్చితంగా ఉంటుందని తెలిసిపోయింది.

రెండేళ్ల తర్వాతే

పుష్ప-2 సినిమాకు సౌండ్‌ ఇంజినీర్‌గా ఆస్కార్‌ అవార్డు విజేత రసూల్‌ పూకుట్టి పనిచేశారు. ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనుక ‘పుష్ప3’ టైటిల్‌ ఉంది. అందులో ‘పుష్ప3: ది ర్యాంపేజ్‌’ అని ఉండటంతో పార్ట్‌-2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట కూడా ‘పుష్ప-3’కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ట్రెండ్‌ అయ్యాయి. ‘పార్ట్‌-3’ ఉంటుందని బెర్లిన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా అల్లు అర్జున్‌ కూడా స్పష్టం చేశారు. అయితే, ‘పుష్ప-2’ క్లైమాక్స్‌లో ‘పార్ట్‌-3’కి లీడ్‌ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. కానీ రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు. రెండు, మూడేళ్ల తర్వాతే ‘పార్ట్‌-3’కి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటు సుకుమార్‌, అటు అల్లు అర్జున్‌కు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి కచ్చితంగా రెండేళ్లు కావాల్సిందే. ఆ తర్వాతే ‘పార్ట్‌-3’కి సంబంధించిన పనులు మొదలవుతాయని తెలుస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button