Puspa: పుష్ప – 2 ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్సైంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పట్నాలో విడుదల చేయనున్నారు.
ఫైనల్ కట్ కంప్లీట్!
‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా ఇది సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. ‘కిస్సిక్’ అనే స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల వర్క్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల ఇష్టాన్ని గుర్తించిన టీమ్.. ముందు అనుకున్న సమయం కంటే ఒక్క రోజు ముందుగా డిసెంబర్ 5న దీనిని విడుదల చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఫైనల్ కట్ పూర్తైందని.. దాదాపు 3 గంటలకు పైగా నిడివితో ‘పుష్ప ది రూల్’ ఉంటుందని టాక్.