తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Puspha – 2: ‘పుష్ప – 2’ ట్రైలర్‌లో ఆసక్తికరంగా అరగుండు గెటప్.. అసలు సుకుమార్‌ ప్లాన్ ఏంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప – 2’ ట్రైలర్ నిన్న రిలీజైంది. ఈ ట్రైలర్ రిలీజైన ఆరు గంటల్లోనే ఏకంగా 41 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ట్రైలర్‌ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్‌తో నింపేశారు దర్శకుడు సుకుమార్. బన్నీ చెప్పే డైలాగ్స్, యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రష్మిక లుక్స్, ఫహద్ విలనిజం అదిరిపోయాయి. అయితే పార్ట్ – 2లో కొన్ని పాత్రలు సైతం తెరపై కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అరగుండు గెటప్‌తో కనిపించిన తారక్ పొన్నప్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించిన తారక్ పొన్నప్ప లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెడలో చెప్పుల దండ, ఇంటెన్స్ లుక్‌తో తారక్ పాత్ర సినిమాకు కొత్త మలుపు ఇవ్వబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మలుపు తిప్పే పాత్ర!

అల్లు అర్జున్, రష్మిక మందన, ఫాహద్ ఫాజిల్, జగపతిబాబు పాత్రలతో పాటు తారక్ పొన్నప్ప పాత్ర కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తారక్ పొన్నప్ప పుష్ప – 2లో తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీలో తన పాత్ర పాజిటివ్, అలాగే నెగిటివ్ షేడ్స్ కలిగినదిగా ఉంటుందని, అల్లు అర్జున్ పాత్రకు కీలక మలుపు తెచ్చే పాత్రగా ఉంటుందని వెల్లడించడం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. కాగా.. కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తారక్, ‘దేవర’లో (భైరా కొడుకు)గా నెగిటివ్ రోల్ ద్వారా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఇక, పుష్ప – 2 ట్రైలర్ ద్వారా ఈ పాత్రకు సుకుమార్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button