తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Raja Saab: ఆ రోజు నుంచి ‘రాజా సాబ్’పై వరుస అప్‌డేట్స్!

మారుతి – పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రాజా సాబ్‌’. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్‌ కామెడీగా ఇది తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘రాజా సాబ్’ సెట్స్ వద్దకు వెళ్లిన టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్‌ (ఎస్‌కెఎన్‌) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు.

అక్టోబర్ 23 నుంచి వరుస అప్‌డేట్స్!

‘అక్టోబర్‌ 23న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వరుసగా వస్తాయి. దీనికోసం దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్‌ ప్రణాళికలు వేసుకున్నారు. త్వరలోనే ‘రాజాసాబ్‌’ అప్‌డేట్స్ గురించి వివరాలు వెల్లడిస్తాం. అక్టోబర్‌ 23 నుంచి విడుదల వరకు ‘రాజాసాబ్‌’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాం. మీడియా వాళ్లకు కూడా ఆ ప్రపంచాన్ని చూపిస్తాం. దర్శకుడు మారుతి ఒక్కరోజు కూడా వృథా కాకుండా చిత్రీకరణ చేస్తున్నారు. వినాయకచవితి, దసరా.. ఇలా ఏ పండగకు కూడా ఆయన సెలవు తీసుకోకుండా కష్టపడుతున్నారు. అనుకున్న సమయంలో సినిమాను విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు’ అని చెప్పారు. ఇక ఈ మూవీలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. గా రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button