Rajamouli: హాలీవుడ్‌ను షేక్ చేసేందుకు రాజమౌళి మాస్టర్ ప్లాన్?
తెలుగు సినిమాను విశ్వవేదిక నిలబెట్టన దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ‘SSMB 29’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ గురించి ప్రపంచం మొత్తం చర్చించుకొనేలా జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే సెట్స్‌పైకి రానుంది. నిన్నమొన్నటి వరకు ఈ మూవీ బడ్జెట్ రూ. 500 కోట్లన్నారు. కానీ ఇప్పుడు రేంజ్ మారింది. ఈ మూవీకి ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ షూటింగ్ టైం కాస్త అటు ఇటు అయితే మరో రెండు, మూడు వందల కోట్లు కూడా కావొచ్చట. ఈ మేరకు ఈ మూవీ బిజినెస్ టార్గెట్ కూడా రూ. 2000 కోట్లుగా పెట్టుకుని ఆయన టీం పనిచేస్తోందట.
రంగంలోకి హాలీవుడ్ టెక్నీషియన్స్!
హాలీవుడ్ రేంజ్‌లో ప్రపంచంలోని ది బెస్ట్ లొకేషన్స్‌లో SSMB29 మూవీ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే లొకేషన్ రెక్కీ కూడా అయిపోయింది. ఆఫ్రికా, కెన్యా అడవుల్లో ఆయనే స్వయంగా తిరుగుతూ లొకేషన్స్‌ని సెలక్ట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మూవీకి హాలీవుడ్ నుంచి కొందరు మోస్ట్ ఫేమస్ టెక్నీషియన్స్‌ని కూడా రంగంలోకి దించుతున్నారట. బాహుబలితో పాన్ ఇండియన్ సినిమాకు గేట్స్ ఓపెన్ చేయడమే కాదు.. బడ్జెట్ బారియర్స్ లేకుండా చేసిన ఘనత రాజమౌళిదే. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఎన్నో తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నాయి. ఇక, ఇప్పుడు SSMB29తో హాలీవుడ్‌లోనూ మన సినిమా మార్కెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారట ఈ దర్శకధీరుడు. ఇదే గనక జరిగితే జక్కన్నకు ఇండియన్ సినిమా భారీగా రుణపడిపోవడం ఖాయమని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.