Rajasaab: తెలుగు సినిమా అంటే.. నేషనల్ కాదు, ఇంటర్నేనల్! జపాన్ లో ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్!
తెలుగు సినిమా అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్.. తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది. మొన్నటి దాకా ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. ప్రపంచ వ్యాప్తంగానూ తెలుగు సినిమా సత్తా చాటుతోంది. దాంతో పాటు మన నిర్మాతలు కూడా గ్లోబల్ వైడ్‌గా మన సినిమాలను ప్రమోట్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ వంటి సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్లు ఏకంగా అమెరికాలో నిర్వహించారు.
భారీ అంచనాలు
ఇక, ఇప్పుడు ఈ కల్చర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో మెట్టు పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ వేసవి కానుకగా మే 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను ఏకంగా జపాన్‌లో నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజాసాబ్ ఆడియో ఫంక్షన్ జపాన్‌లో చేయాలనుకుంటున్నారు. అందుకే ఓ పాటకు జపాన్ వెర్షన్ చేయమని నన్ను అడిగారు.’ అని అన్నారు.