Ram Charan: రామ్ చరణ్‌కి దేశంలోనే అతిపెద్ద కటౌట్.. ఎక్కడో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కియరా అడ్వాణీ, అంజలి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసింది. అయితే ఈ మూవీ విడుదల సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏకంగా రామ్ చరణ్ కి 256 అడుగుల కటౌట్‌ని ఏర్పాటు చేశారు.
ఐదు రోజుల కష్టం!
విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ ఈ బిగ్గెస్ట్ కటౌట్‌ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరు కాబోతుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా రానున్నారు. కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ లుక్‌తో కటౌట్ ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద కటౌట్ అని మెగా అభిమానులు చెబుతున్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజుల పాటు అభిమానులు కష్టపడ్డారు.