Ram Charan: రెమ్యూనరేషన్‌ను భారీగా తగ్గించుకున్న రామ్ చరణ్.. ఎందుకో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – యూనివర్సల్ డైరెక్టర్ శంకర్ ల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైపోయింది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లతో దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడం, పైగా ఐదేళ్ల తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. మరోవైపు ఈ సినిమాకు చరణ్ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేవలం రూ. 65 కోట్లేనా?
పాన్ ఇండియా లెవల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎంతటి క్రేజ్ వచ్చిందో చూశాం. ఈ మూవీతో రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఇండియా వైడ్‌గా ప్రస్తుతం రామ్ చరణ్ అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. పాన్ ఇండియాలో ఉన్న క్రేజ్‌ను బట్టి చరణ్ తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేశారని, ‘గేమ్ ఛేంజర్’ కోసం కనీసం రూ. వంద కోట్లు అయినా తీసుకొని ఉంటారని, లేదు ఇంకా ఎక్కువే తీసుకొని ఉంటారన్న చర్చ జరిగింది. అయితే రియాల్టీ మాత్రం వేరేలా ఉంది. ఈ సినిమాకు చరణ్ తన రెమ్యూనరేషన్‌ను పెంచడం కాదు, ఏకంగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణం చాలా ఆలస్యం కావడం, వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా పడడం, వీటన్నింటి వల్ల నిర్మాణ వ్యయంతో పాటు, పెట్టుబడిపై వడ్డీలు కూడా పెరిగిన నేపథ్యంలో నిర్మాతకు నష్టం కలగకుండా ఉండేందుకు చరణ్ తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్నారట. చరణ్ మాత్రమే కాదు, దర్శకుడు శంకర్ కూడా చాలా తక్కువ రెమ్యూనరేషన్‌కే ఈ సినిమా చేసినట్లు తెలుస్తోంది. చరణ్ రూ. 65 కోట్లు, శంకర్ రూ. 35 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.