
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై రామ్ చరణ్ ఆసక్తికర పోస్ట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సినిమాని ఆదరించిన ఫ్యాన్స్‌కి, ఆడియన్స్‌కి కృతజ్ఞతలు చెప్పారు. తన హృదయంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ‘మీరు గర్వపడేలా.. అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడం కొనసాగిస్తా’ అని అన్నారు.
రూ. 500 కోట్ల బడ్జెట్‌తో..
తమిళ్ డైరెక్టర్ శంకర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీతో దర్శకుడు శంకర్ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. అయితే మూవీలో రామ్ చరణ్ నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. రెండు భిన్న పాత్రల్లో రామ్ చరణ్ నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దిల్ రాజు నిర్మాణంలో దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో మెప్పించారు.