పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారోనని ఆయన ఫ్యాన్స్‌తో పాటు, సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉంటుంది? ఏ రాజ వంశానికి చెందిన వారై ఉంటారు? అన్న ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి గురించి హీరో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గణపవరం అమ్మాయితో..?
బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ఇటీవల హీరో రామ్ చరణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ పాల్గొన్న ఎపిసోడ్ తొలి భాగం జనవరి 8న ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయి అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో చరణ్ అనేక విశేషాలు పంచుకున్నారు. రెండో ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా.. రామ్‌చరణ్ ఆసక్తికర సమాధానం చెప్పారట. ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారని రామ్ చరణ్ చెప్పినట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి 14న ‘ఆహా’లో ప్రసారం కానుంది.