Rashi Khanna: నేనొక లవ్ ఫెయిల్యూర్.. రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!
12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ ఆధారంగా ఈ మూవీని ధీరజ్ శర్ణ తెరకెక్కిస్తున్నారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. నవంబర్ 15న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఎంతో డిస్టర్బ్ అయ్యా!
‘వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్ పర్సన్. గతంలో నాకో లవ్ స్టోరీ ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా. మానసికంగా కుంగుబాటుకు గురయ్యా. ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నా. స్ట్రాంగ్‌గా నిలబడ్డా. కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇండస్ట్రీలో కంటే బయటే నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటారు. వారే నా బలం’ అని తెలిపారు.