
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. అయితే రష్మిక కాలికి గాయం ఇంకా తగ్గలేదు. ఇవాళ శంషాబాద్ విమానాశ్రయంలో కాలికి పెద్ద కట్టు, వీల్ చైర్‌లో రష్మిక కనిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ‘ఏంటి రష్మికకు ఇంతపెద్ద గాయమైందా?’ అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.
ఎప్పుడు కోలుకుంటానో..!
కాగా.. తనకు గాయమైనట్లు తెలుపుతూ ఇటీవల రష్మిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యాన్ని క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్ అయినా వెంటనే షూట్‌లో భాగం అవుతా’ అని పేర్కొన్నారు. కాగా ‘పుష్ప-2’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం రష్మిక ‘ఛావా’తో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 14న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.