తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Raviteja: మాస్ మహారాజ్..‘మాస్ జాతర’.. పోస్టర్ రిలీజ్!

మాస్ మహరాజ్ రవితేజ తన అభిమానులకు దీపావళి కానుక ఇచ్చారు. భాను భోగవరపు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 75వ చిత్రానికి సంబంధించి మేకర్స్ టైటిల్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. జాతర సందడిలో దీపావళి పండుగను తలపిస్తూ టపాసుల వెలుగుల నడుమ, తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ మాస్ మహారాజా అభిమానులతో పాటు, సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

థియేటర్లలో జాతరే!

మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి రవితేజ.. తన నుంచి మంచి మాస్ ఎంటర్‌టైనర్‌ను కోరుకునే అభిమానులు, ప్రేక్షకుల కోసం ‘మాస్ జాతర’తో రాబోతున్నారు. ‘మాస్ జాతర’ అనే టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇది విందు భోజనంలా, అసలు సిసలైన మాస్ మహారాజా సినిమాలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ మూవీ వేసవి కానుకగా మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button