RGV: అల్లు ఈజ్ మెగా.. డైరెక్టర్ ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!
ఎక్కడ చూసినా పుష్ప.. పుష్ప .. పుష్ప.. పుష్ప.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మూవీ మేకింగ్, మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ యాక్షన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్లలో గూస్ బంప్స్ రావడం పక్కా అని చెబుతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇండస్ట్రీ హిట్
డైరెక్టర్ ఆర్జీవీ పుష్ప-2 సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇండియాలోనే బిగెస్ట్ హిట్.. ఇండస్ట్రీ హిట్ మూవీ అందించిన పుష్ప మూవీ టీమ్‌కు, అల్లు అర్జున్‌కు అభినందనలు తెలిపారు. అయితే మాములుగా ట్వీట్ చేస్తే ఆర్జీవీ ఎందుకు అవుతారు. చివరిలో కౌంటర్ ఇచ్చారు కూడా ఇచ్చారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒకే ఒక్కడు బన్నీఅంటూ పొగిడేశారు. 1913లో మొదటి సినిమా వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పుష్ప-2 లాంటిది రాలేదని చెప్పారు. ఈ వందేళ్లలో బిగ్గెస్ట్ స్టార్, మెగాస్టార్ ఆఫ్ ఇండియా బన్నీ అంటూ ట్వీట్ చేశారు. అల్లు ఈజ్ మెగా మెగా మెగా.. అంటూ చివరిలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.